కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి ఆర్పీ గుప్తాకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. యూఎస్‌లోని బోస్టన్ తరహాలో భారతదేశ తీర ప్రాంతం వెంబడి ప్రణాళికల కోసం సర్వేలు చేయాలని కోరారు. బోస్టన్ నగరంలో తీర ప్రాంత రక్షణ కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించాలన్నారు. రానున్న కొన్ని దశాబ్దాల్లో సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో కోస్టల్ కారిడార్ల పేరిట భారీగా పెట్టుబడులను తీర ప్రాంతాల్లో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంతాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
అణు విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీర ప్రాంతాల్లో ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంత రక్షణలో లోపాలు ఉంటే భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. 2014 హుద్‌హుద్ తుపాన్ ప్రభావానికి స్థానికంగా ఉన్న విమానాశ్రయంతో పాటు పలు కట్టడాలు దెబ్బతిన్నాయని ప్రస్తావించారు. ఇతర దేశాల తరహాలో భారత్‌లోనూ వాతావరణ మార్పులపై సరైన రీతిలో ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి