విశాఖలోని పలు ఎయిడెడ్ పాఠశాలలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు(Former CBI Jd Laxminarayan visit several aided schools ). ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 15 గురించిపై పూర్ణా మార్కెట్ సమీపంలోని ఏవీఎన్ పాఠశాల, జ్ఞానాపురంలోని సెక్రెడ్ హార్ట్, సెయింట్ పిటర్స్ స్కూల్ యాజమాన్యాల అభిప్రాయం తెలుసుకున్నారు. అన్ ఎయిడెడ్ విధానం.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందనే విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పాఠశాల యాజమాన్యాలను.. లక్ష్మీనారాయణ కోరారు(Former CBI Jd Laxminarayan on aided schools).
ఈ సందర్భంగా ఆయనతో పాటు పూర్వ విద్యార్థి నాయకుడు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, జేడీ ఫౌండేషన్ సభ్యులు, జగన్ మురారి, నొల్లు నాగరాజు, కృష్ణ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇద చదవండి..