ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖ తీరంలో వ్యర్థాలను తొలగించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు చెందిన ప్లాటిపస్ ఎస్కేప్స్ సంస్థకు చెందిన స్కూబా డైవర్ల బృందాన్ని ప్రశంసించారు. ఇప్పుడు ఫ్రాన్స్ దేశీయులు అలెక్స్, టాంగీ స్వచ్ఛసాగరం లక్ష్యంగా చేస్తున్న యత్నంలో భాగస్వాములు అయ్యారు. వినూత్న ఆలోచనలో తోడుకావడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సాగర తీరాల్ని, సముద్ర గర్భాల్ని కాలుష్యరహితంగా ఉంచేందుకు ప్రజల బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాటిపస్ బృందంతో కలిసి అలెక్స్, టాంగీ 40 కేజీలకుపైగా వ్యర్థాలను సముద్రం బయటకు తీసుకొచ్చారు.
సంబంధిత కథనం
సముద్రంలో చెత్త తీస్తున్న వైజాగ్ టీమ్.. శెభాష్ అన్న ప్రధాని మోదీ