ETV Bharat / city

PROTEST: 'వేధింపులు భరించకలేకపోతున్నాం.. ఆ అధికారిని బదిలీ చేయండి'

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వేధిస్తున్నారంటూ విశాఖ జిల్లాలోని ఆలయాల ఈవోలు సమావేశం(meeting) నిర్వహించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న సహాయ కమిషనర్​ శాంతిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖలో ఆందోళన
విశాఖలో ఆందోళన
author img

By

Published : Sep 29, 2021, 4:30 PM IST

విశాఖలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి, ఉద్యోగుల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సహాయ కమిషనర్ తమను మానసికంగా వేధిస్తున్నారంటూ... జిల్లాలోని వివిధ దేవాలయాలకు చెందిన ఈవోలు సమావేశం నిర్వహించారు. కోర్టు వ్యవహారాల్లో లాయర్లకు ఇవ్వాల్సిన ఫీజులను తమతో వ్యక్తిగతంగా కట్టించుకుని, ప్రభుత్వం నుంచి డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలో ఆర్​జేడీకి ఫిర్యాదు చేశామని, ఆ కోపంతో తమను మానసికంగా వేధిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ కమిషనర్ శాంతి​ ను వెంటనే బదిలీ చేయాలని, ఆమె బదిలీ అయ్యేంతవరకు విధులకు హాజరు కాలేమని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

cine producers : మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.