ETV Bharat / city

"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ

author img

By

Published : May 9, 2020, 3:45 PM IST

Updated : May 9, 2020, 5:52 PM IST

రాత్రి తనతో పాటే.. పడుకున్న తన చిన్నారి తల్లి.. పొద్దునకు కనుమరుగైపోయింది. పాపకు ఏ సమస్యా లేదు. తప్పు తమది కాదు. ఎవరు చేసిన పాపమో.. తన పాపను బలితీసుకుంది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో 9 ఏళ్ల గ్రీష్మ చనిపోయింది. అపస్మారక స్థితికి చేరిన తల్లికి నిన్న మధ్యాహ్నమే విషయం తెలిసింది. జరిగిన అన్యాయం తెలుసుకున్న ఆ తల్లి గుండె ఒక్కసారిగా మండింది.. నిన్నటి నుంచి రగిలిపోతున్న ఆమె... అడ్డంకులను దాటుకు వచ్చి మరీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నిలదీసింది. ఆ వెంటనే "మీ కాళ్లు పట్టుకుంటాం. నాకు న్యాయం చేయండి" అంటూ ఆ తల్లి పడిన ఆవేదనను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ
"నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ

విశాఖ నగరంలో హానికారక స్టైరీన్ వాయువు విడుదలై 12 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించినప్పుడు ఓ సంఘటన జరిగింది. డీజీపీ అక్కడకు వచ్చినప్పుడే ఈ ఘటనలో నష్టపోయిన బాధితులంతా... పరిశ్రమ వద్దకు వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున గేటు వద్ద ఆందోళన చేస్తున్నారు. డీజీపీ లోపల ఉండటంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

అయితే ఈ దుర్ఘటనలో కన్నబిడ్డను పోగొట్టుకున్న ధన.. కోపంతో రగిలిపోయింది. . గేట్లను దూకి లోపలకు దూసుకొచ్చింది. ఆ తల్లి ఆవేశాన్ని గుర్తించిన పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. కంపెనీ చేసిన తప్పునకు.. తాను బిడ్డను పోగొట్టుకున్నానని ... తనకు ఎవరు న్యాయం చేస్తారని డీజీపీని ప్రశ్నించింది. ఆయన కాళ్ల మీద పడుతూ... తన బిడ్డను తనకు తెచ్చివ్వమని రోదించింది. ఆమె బాధను చూసిన వారంతా.. చలించిపోయారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ధన కుమార్తె.. తొమ్మిదేళ్ల గ్రీష్మ మృతి చెందింది.

కరోనా పరీక్షల్లో రాష్ట్రానికి అగ్రస్థానం: సీఎం జగన్

Last Updated : May 9, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.