ETV Bharat / city

పోస్కోతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలి: రామకృష్ణ

విశాఖ ఉక్కు సీఎండీకి గురువారం పరిశ్రమ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడాన్ని సీపీఐ సమర్దించింది. సమ్మె నిర్ణయానికి మద్దతు తెలిపింది.

cpi support to vishaka steel plant labour strike

author img

By

Published : Mar 12, 2021, 12:27 PM IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరవధిక సమ్మెకు సీపీఐ మద్దతు తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. పోస్కోతో 2019లో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని రామకృష్ణ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.