ETV Bharat / city

కరోనా వేళ.. వ్యర్థాల వినియోగంలో ఆదర్శం..!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేవ్యవస్థ ఉన్న దేశం మనది. రోజూ టన్నుల కొద్దీ పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పుడో ఒకసారి వేలం వేస్తుంటారు. అవే వ్యర్థాలకు తమ విజ్ఞానాన్ని జోడించి.. కరోనాపై పోరులో ఉపయోగించేలా వినూత్న పరికరాలను కనుగొన్నారు విశాఖ డీజిల్‌ లోకో షెడ్‌ సీనియర్‌ ఇంజినీర్‌.

Corona time .. Waste consumption is ideal in visakha Railway
వ్యర్థాల వినియోగంలో ఆదర్శం
author img

By

Published : Aug 29, 2020, 5:57 PM IST

వ్యర్థాల వినియోగంలో ఆదర్శం

విశాఖలోని డీజిల్‌ లోకోషెడ్‌.. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. రైల్వే కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తూ పనిచేసే ఈ విభాగంలో టన్నుల కొద్దీ ఇనుప, చెక్క వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే పరికరాలను ఆ వ్యర్థాల నుంచే తయారుచేశారు లోకోషెడ్‌ సీనియర్‌ ఇంజినీర్ పాత్రో. తన సిబ్బందితో కలిసి... కాలితో ఆపరేట్‌ చేసే శానిటైజర్‌ డిస్పెన్సర్లు, కరెన్సీ నోట్లు, ఇతర దస్త్రాలను శానిటైజ్‌ చేసే పరికరాలు, వాష్‌ బేసిన్లు తయారు చేశారు.

రిజర్వేషన్‌ కౌంటర్ల వద్దకు వచ్చే ప్రయాణికులు కరెన్సీ నోట్లను అక్కడి సిబ్బందికి ఇచ్చేటప్పుడు... వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముంది. దాని నిరోధానికే ఆ నోట్లను 10 సెకన్లలో క్రిమీరహితం చేసే శానిటైజర్‌ను కనుగొన్నాం. తూర్పుకోస్తా రైల్వే పరిధిలో 150 బుకింగ్ కౌంటర్లకు వీటిని పంపిణీ చేశాం. -పాత్రో, సీనియర్‌ ఇంజినీర్

పలు వినూత్న సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చాక... మొత్తం గదిని శానిటైజ్‌ చేసే పరికరాన్ని పాత్రో తయారు చేశారు. ఓ గదిని 30 మీటర్ల దూరం నుంచే రిమోట్‌ సాయంతో క్రిమీరహితం చేసేలా ఓ యూవీ యంత్రాన్ని ఆవిష్కరించారు. ఇలా విభిన్న పరికరాల తయారీయే కాక ఫేష్‌ షీల్డ్‌, శానిటైజర్లు సిద్ధం చేసి డివిజన్‌ అంతా సరఫరా చేస్తున్నారు.

ఓ గది నుంచి ఇంకోదానికి సులువుగా తరలించేందుకు ఈ యంత్రానికి చక్రాలు సైతం అమర్చాం. రిమోట్‌ ద్వారా 20-30 మీటర్ల దూరం నుంచైనా దీన్ని ఆపరేట్‌ చేయొచ్చు. యూవీ కిరణాలు హానికరం కాబట్టి... గదిని శానిటైజ్‌ చేసేటప్పుడు దాని చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు. ఆసుపత్రుల్లో మందులు, ఆహారం పంపిణీకి ఓ రోబో తయారీలోనూ నిమగ్నమై ఉన్నాం. ఇది ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. 10 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. -పాత్రో, సీనియర్‌ ఇంజినీర్

ఇదీ చదవండీ... 'శిరోముండనం ఘటనలో నూతన్​ నాయుడు భార్యపై కేసు నమోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.