విశాఖ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే-2020పై పరిశ్రమల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని సుమారు 11 వేల పరిశ్రమల్లో దాదాపు 7 వేల దాకా తయారీ పరిశ్రమలు, 144 భారీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ సర్వేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్స్, పట్టణ ప్రాంతాల్లోని వార్డ్ అమినెటి సెక్రటరీలతో చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు జిల్లాలో 30 మంది లీడ్ ఆఫీసర్స్‌ను ఎంపిక చేశారు.
పరిశ్రమల ఎస్టేట్లలో ఏపీఐఐసీ అధికారులు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమల శాఖాధికారులు... పర్యవేక్షణాధికారులుగా ఉంటారన్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులకు కావలసిన పూర్తి సహాయ, సహకారాలను అందించి సహకరించవలసిందిగా పరిశ్రమల యజమాన్యాలకు కలెక్టర్ కోరారు. ఈ సర్వే ద్వారా పరిశ్రమల నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సర్వేను అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :
భూ ఆక్రమణలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి: విశాఖ జిల్లా కలెక్టర్