విశాఖలోని సీఎంఆర్ సెంట్రల్లో సామూహిక అక్షరాభ్యాసం- సరస్వతీ పూజ మహోత్సవం జరిగింది. ఈనాడు- సీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 125 మందికి పైగా బాలలు, వారి తల్లిదండ్రులు సరస్వతీపూజలో పాల్గొన్నారు. వేదపండితులతో గణపతి పూజ, సరస్వతీ ఆరాధన పూర్తి చేయించి పిల్లలతో అక్షరాలను దిద్దించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయ విశ్రాంత ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి... వసంత పంచమి ప్రాముఖ్యతను వివరిస్తూ... చిన్నారులు, తల్లిదండ్రులను ఆశీర్వదించారు. 64 ఏళ్ల ఉషాప్రసాద్ కూచిపూడి నృత్యంతో అమ్మవారికి అంజలి ఘటించారు.
ఇదీ చదవండి :