అమెరికా జాతి అహంకార దాడులకు వ్యతిరేకంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అమెరికా జాతి అహంకార దాడులు ఆపాలని, నల్ల జాతీయులకు రక్షణ కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ రకమైన చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : జార్జి ఫ్లాయిడ్ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆందోళన