జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి
విశాఖ జిల్లా పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన ఉండేలా తెదేపా ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు..జిల్లా కేంద్రంలో 2 రోజులపాటు మకాం వేసి నేతలు, కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. జిల్లాలో అనుబంధ సంఘాల బలోపేతం, సామాజిక న్యాయంతో పార్టీ పటిష్ఠం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అన్నివర్గాలను సమన్వయం చేసుకుని.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలపైనా జిల్లా నేతలకు తెదేపా అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చేవారం నెల్లూరు, పైవచ్చేవారం.. శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ పర్యటన