![చంద్రబాబు ట్వీట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8140331_1027_8140331_1595496879095.png)
కర్నూలు జిల్లాలో కరోనా బాధితులను ఒకే అంబులెన్స్‌లో తరలించిన సంఘటన మరువక ముందే విశాఖలో మరో ఘటన వెలుగు చూసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో కొవిడ్ బాధితులను ఆర్టీసీ బస్సులో కుక్కి పంపారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుందని నిలదీశారు. ఏపీలో అతి పెద్ద ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదం ఉందనటానికి ఇదో హెచ్చరిక అన్న చంద్రబాబు... వీడియో చూసి విస్తుపోవాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: