బలహీన వర్గాల వారికి ప్రభుత్వం టిడ్కో ద్వారా నిర్మిస్తున్న 14 వేల 368 ఇళ్లకు... రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వానికి రూ.106 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రూ.707 కోట్లకు గానూ.. రూ.661 కోట్లకే టెండర్ వేసినట్టు వివరించారు. 430, 360, 300 చదరపు గజాల ఇళ్లను నిర్మిస్తున్నట్లు.. ఇందులో 300 చ.గ ఇళ్లను పూర్తి ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని బొత్స వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ పథకాలకు మీడియా వక్రభాష్యం చెప్పకూడదు'