కార్మికుల క్రమబద్ధీకరణ, నిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలని బీఎంఎస్ కార్మిక సంఘం(bms union protest) నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద నేతలు(bms union protest at vishaka steel plant) ధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ, నిర్వాసితులందరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్జేసీఎస్లోని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చించాలని.. 58 ఏళ్లు నిండిన వారికి ఈపీఎఫ్, మెరుగైన పింఛన్ స్కీం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. : SCAM and ARREST: ఉపాధి హామీ పథకంలో అక్రమార్కులు...ఎన్ని కోట్లు దోచుకున్నారంటే..