వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ విశాఖలో బంధువులు ఆందోళన చేపట్టారు. ద్వారకనగర్‌లోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో 5 రోజుల క్రితం భవిష్య అనే ఏడాదిన్నర వయస్సున్న పాపను గుండెలో కపం పట్టిందని తండ్రి అనిల్ కుమార్ చేర్పించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్ వేసిన అనంతరం పాపకు శ్వాస అందకపోవడంతో కేజీహెచ్‌కు తరలించాలని వారు సూచించారని పాప తండ్రి అనిల్ తెలిపారు. అక్కడకు తీసుకువెళ్లగా పాప చనిపోయిందని చెప్పగా... వారంతా ఆగ్రహంతో తిరిగి పిల్లల హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్‌ను సీజ్ చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే.. పాప చనిపోయిందంటూ ఆందోళన - baby death in vishakha parents protest infront of anupama surgical and childerns hosp
ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన విశాఖలో జరిగింది.