ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో వైకాపా ఎంపీల పాత్ర' - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శైలజానాథ్ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో వైకాపా ఎంపీల పాత్ర ఉందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. వారెవరో త్వరలో బయట పెడతామన్నారు.

apcc chief
'విశాఖ ఉక్కు కర్మగార ప్రైవేటీకరణలో వైకాపా ఎంపీల పాత్ర'
author img

By

Published : Feb 10, 2021, 6:10 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన విలువైన భూమిని కొట్టేయడానికే ప్రైవేటీకరణను తెరపైకి తెచ్చారని,.. ఈ వ్యవహారంలో వైకాపా ఎంపీలకూ ప్రమేయం ఉందని ఏపీసీసీ అధ్యక్షులు ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం భూముల విలువ రూ.2 లక్షల కోట్లు ఉంటుందని.. ప్రైవేటీకరణ వెనుక ఉన్న వైకాపా ఎంపీలు ఎవరో త్వరలో బయట పెడతామన్నారు. వైకాపా నాయకులు విశాఖలో భూములపై గద్దల కన్నా హీనంగా వాలిపోతున్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రపై కార్పొరేట్ దోపిడీదారుల కన్ను పడిందని.. కార్పొరేట్ శక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో బాక్సైట్ తవ్వడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారుల్లో జీవో జారీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పేదొకటి.. చేసేది మరొకటని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న పెద్ద ఎత్తున విశాఖలో నిరసనకు పిలుపునిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: 'విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై.. హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.