కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సాంబరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం పెద్ద ఎత్తున వరాలు ప్రకటించినప్పటికీ... మంచి నిర్ణయాలని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, రైతులకు సాయం, టీడీఎస్ పెంపు వంటి నిర్ణయాలు సామాన్యులకి మేలు చేకూరుస్తాయని అన్నారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి ప్రజలను సోమరిపోతుల్నా మార్చడం కంటే ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.