ETV Bharat / city

'రాజ్యాంగ రచయిత పేరు.. కోనసీమ జిల్లాకు వచ్చిందని గర్వపడాలి' - కోనసీమ జిల్లా మార్పు వార్తలు

కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చటాన్ని.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐక్యకార్యాచరణ శాంతిసమితి సమర్థించింది. రాజ్యాంగ రచయిత పేరు కోనసీమ జిల్లాకు వచ్చిందని గర్వపడాలని అధ్యాపకులు అన్నారు. అంబేడ్కర్​ను ఒక కులానికి పరిమితం చేయద్దని.. ఆయన ప్రపంచ దిశా నిర్దేశిత ఆదర్శ మూర్తి అని కొనియాడారు.

round table meeting
round table meeting
author img

By

Published : May 28, 2022, 7:39 PM IST

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐక్యకార్యాచరణ శాంతిసమితి ఆధ్వర్యంలో.. "డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం సముచితం" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వ విద్యాలయ అధ్యాపకులు, నగర ప్రముఖులు ఈ చర్చలో పాల్గొన్నారు.

కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడం ఒక అదృష్టం. రాజ్యాంగ రచయిత పేరు కోనసీమ జిల్లాకు వచ్చిందని గర్వపడాలి. మిగిలిన జిల్లాల వాళ్లు ఈ మంచి అవకాశం రాలేదని బాధపడాలి. - ఆచార్య డీవీఆర్ మూర్తి, ఆంధ్ర విశ్వ విద్యాలయం డీన్

కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని ఎక్కువ వినతులు వెళ్లాయని.. ఎన్టీఆర్ కూడా తిరుపతి సీటును అంబేడ్కర్ కుమార్తెకు ఇవ్వాలని అనుకున్నారని విశ్వవిద్యాలయ అధ్యాపకులు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది దళిత ప్రజా ప్రతినిధులు కోనసీమ జిల్లా నుంచే వచ్చారని.. అంబేడ్కర్​ను ఒక కులానికి పరిమితం చేయద్దని.. ఆయన ఒక ప్రపంచ దిశా నిర్దేశిత ఆదర్శ మూర్తి అన్నారు. కృష్ణుడు గీత ఇచ్చారు.. జీసస్ బైబిల్ ఇచ్చారు.. అల్లా ఖురాన్ ఇచ్చారు.. అంబేడ్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చారని అన్నారు.

పుస్తకాల అవిష్కరణ : విశాఖ రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మూడు పుస్తకాల అవిష్కరణ జరిగింది. ఆచార్య బాబీ వర్ధన్, డాక్టర్ చల్లా అభిషేక్ రచించిన జెండర్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ జర్నలిజం, డాక్టర్ పద్మ మీనాక్షి సంయుక్తంగా రచించిన అడ్వర్టైజ్ పబ్లిక్ రిలేషన్ అనే మూడు పుస్తకాలను సెంచరియన్ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య జీఎస్​ఎన్ రాజు ఆవిష్కరించారు. రైటర్స్ అకాడమీ ఛైర్మన్ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.

నేటి జర్నలిజం విద్యార్థులకు, పరిశోధకులకు ఈ పుస్తకాలు ఎంతో జ్ఞానాన్ని అందిస్తాయని ఆచార్య బాబీ వర్ధన్ అన్నారు. అనేక అంశాలు పరిశీలన చేసి ఈ పుస్తకాలు రూపొందించినట్టు డాక్టర్ చల్లా అభిషేక్ తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.