ETV Bharat / city

రూ.2కే ప్రార్థనా స్థలాలను శుభ్రపరుస్తున్న న్యాయవాది

author img

By

Published : Jun 14, 2020, 7:44 PM IST

కరోనా విపత్కాలంలో అనేక మంది...వివిధ రూపాల్లో సహాయసహకారాలు అందిస్తున్నారు. విశాఖకు చెందిన ఓ ముస్లిం యువకుడి వినూత్న ప్రయత్నం ఐక్యతా మంత్రాన్ని చాటుతోంది. వృత్తిరిత్యా న్యాయవాది అయిన ఎంజీఎం ఖాన్.. జనసంచారం ఎక్కువగా ఉండే ఆధ్యాత్మిక ప్రదేశాల్లో..కేవలం రెండు రూపాయలకే రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. మందిరం, మసీదు, చర్చి అనే భేదం లేకుండా..అన్నీ ప్రదేశాల్లో వైరస్ నిరోధానికి పాటుపడుతున్నాడు.

Advocate of cleaning of places of worship for two rupees
యువ న్యాయవాది ఎంజీఎం ఖాన్

రెండు రూపాయలకే మన గుడి శుభ్రం అవుతోంది. రెండు రూపాయలతో కరోనా వైరస్ మనల్ని తాకకుండా మసీదు, చర్చి, గురుద్వారాల్లో డిసిన్ఫెక్షన్ స్ప్రేయింగ్ జరుగుతోంది. కరోనా కష్ట కాలంలో కొద్ది సమయం ప్రార్థనా స్థలానికి వెళ్లి కాస్త ఉపశమనం పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక భావనతో మనం వెళ్లే ప్రార్థనా మందిరాలకు కరోనా వైరస్ తాకకుండా ఉండాలని విశాఖకు చెందిన న్యాయవాది ఎంజీఎం ఖాన్ ముందుకొచ్చారు. ప్రార్థన స్థలాల్లోని టచ్ పాయింట్ వద్ద ప్రత్యేక ద్రవ మిశ్రమాన్ని స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా పని చేస్తున్నా... కరోనాపై పోరులో భాగం కావాలని ఈ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

యువ న్యాయవాది ఎంజీఎం ఖాన్

రోజూ 9గంటలు సేవకు అంకితం..

ప్రార్థనా స్థలాలను శానిటైజ్ చేయడానికి వాడే మిశ్రమంలో ఆల్కహాల్ కంటెంట్ లేకుండా తయారు చేస్తున్నారు ఖాన్. ముద్ద కర్పూరాన్ని సైతం ఈ మిశ్రమంలో ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు.రోజులో సుమారు 9 గంటల సమయాన్ని ఈ పని కోసం కేటాయిస్తున్నారు. రతన్ టాటా మాటల స్ఫూర్తితో ఈ పవిత్ర కార్యాన్ని మొదలు పెట్టినట్లు ఖాన్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 ప్రార్థనా మందిరాలకు శానిటైజ్ చేశారు.

ఇవీ చదవండి: వాల్తేరు డివిజన్​లో ఈ-వాహనాల వినియోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.