ETV Bharat / city

AP Govt vs Empolyees : ఉద్యోగుల "సింహగర్జన"కు.. సర్కారు సమాధానమేంటి?

YSRCP Govt On PRC: పీఆర్సీ మొదలు సీపీఎస్ దాకా.. ఏడు పదుల సమస్యలు సర్కారు ముందు పెట్టారు ఉద్యోగులు. వీటిని అంగీకరించే వరకూ తగ్గేదె లే అంటూ ఉద్యమిస్తున్నారు. దశల వారీగా కార్యాచరణ మొదలు పెట్టిన ఉద్యోగులు.. ఇవాళ సింహగర్జన చేశారు. మరో వైపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. స్పష్టమైన ప్రకటన మాత్రం వెల్లడించలేదు. సజ్జల వంటి వారు మాత్రం.. సర్కారును హెచ్చరిస్తే.. ఉద్యోగులకే ఇబ్బంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది?

పీఆర్సీ-ఫిట్​మెంట్ ఖరారు
పీఆర్సీ-ఫిట్​మెంట్ ఖరారు
author img

By

Published : Dec 10, 2021, 8:08 PM IST

AP Govt On PRC: పీఆర్సీపై ఉద్యోగులు మొదలు పెట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. ఇవాళ సింహగర్జన సభ నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై స్పష్టత ఇవ్వాల్సిందేనని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సీపీఎస్ రద్దు, పీఆర్సీలో హెచ్ఆర్ఏ సహా వివిధ అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తంగా నివేదికపై చర్చించాల్సి ఉందంటున్నాయి. విజయవాడ వేదికగా 'సింహగర్జన' సభకు పలు జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు.

దీనిపై ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఏ మేరకు పీఆర్సీ ఫిట్​మెంట్​ను ప్రకటించ వచ్చన్న అంశంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పష్టత ఇచ్చే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీఆర్సీ ఫిట్​మెంట్​ను 30-35 శాతం మధ్య ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 13, 14 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు రావాల్సిందిగా సీఎస్ ద్వారా సమాచారం పంపించే అవకాశముందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు..
సీపీఎస్‌ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలన్నారు. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

'ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి. పీఆర్‌సీతో పాటు నాన్‌ ఫైనాన్షియల్‌ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలి. పీఆర్‌సీ ప్రకటించినా..ఉద్యమాన్ని విరమించేది లేదు. రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతాం. సీఎంపై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఎదురుచూశాం. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలి' -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌

అప్పటి వరకు ఉద్యమం ఆగదు..

'సీపీఎస్ ఉద్యమం ఆరేళ్లుగా కొనసాగుతోంది. సీపీఎస్‌తో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్‌ రద్దుచేస్తామని జగన్‌ అన్నారు. రెండున్నరేళ్లయినా హామీ అమలు చేయలేదు. సీపీఎస్‌పై 3 కమిటీలు ఎందుకు..? సీపీఎస్ రద్దయ్యేవరకు ఉద్యమం ఆగదు. సీపీఎస్ రద్దు మా హక్కు.. పోరాటం ఆపేది లేదు' - సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు

సీపీఎస్‌ రద్దు కోసం కృషి చేస్తా..
సీపీఎస్‌ రద్దు కోసం కృషి చేస్తానని సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల సింహగర్జన సభలో పాల్గొన్న ఆయన.. మరో 9 నెలల్లో సీపీఎస్‌ రద్దవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. 9 నెలల్లో సీపీఎస్‌ రద్దు కాకుంటే ఉద్యోగులకు తన మద్దతిస్తానని..,కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై ధర్నా చేస్తానన్నారు. మరి, ఈ నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

'సీపీఎస్‌ రద్దు కోసం కృషి చేస్తా. మరో 9 నెలల్లో సీపీఎస్‌ రద్దవుతుందని భావిస్తున్నా. 9 నెలల్లో సీపీఎస్‌ రద్దు కాకుంటే ఉద్యోగులకు మద్దతిస్తా. సీపీఎస్‌ రద్దు కాకుంటే కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై ధర్నా.' -వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు

సంబంధిత కథనాలు

AP Employees protest : 'సీపీఎస్ రద్దు మా హక్కు.. పోరాటం ఆపేది లేదు'

PRC Update:ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ.. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడంటే?

GOVT ADVISOR ON PRC: ఉద్యోగులు సంయమనం పాటించాలి

Employees Agitation: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.