ETV Bharat / city

నేతల పోటాపోటీ ప్రచారాలు.. అధికారుల అవగాహన ర్యాలీ - ఈరోజు విజయవాడ ఎన్నికల ప్రచారాలు తాజా వా

విజయవాడలో నేతలు జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తెదేపా నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రచారాలు సాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అస్త్రాలుగా ఉపయోగిస్తూ.. ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

muncipal election campaining
నేతల పోటాపోటీ ప్రచారాలు.. అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 7, 2021, 11:38 AM IST

పురపాలక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే నిర్మాణం పూర్తై పెండింగ్​లో ఉన్న ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందిస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తై 20 నెలలు గడిచినా.. లబ్ధిదారులకు అందించలేదని ఆమె మండిపడ్డారు. ఒక్కో ఇంటికి 20 వేల నుంచి లక్షన్నర ఇవ్వాలని.. వైకాపా నేతలు లబ్ధిదారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెదేపాను గెలిపిస్తే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 21 వేల రూపాయలకు పెంచటంతో పాటు.. ఆటో కార్మికులకు శాశ్వత స్టాండ్​లను.. అన్ని వసతులతో నిర్మిస్తామని తెలిపారు. వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాల పెరిగాయని కేంద్ర నేరపరిశోధన విభాగం నివేదిక స్పష్టం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రచారం..

మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా నందిగామలోని 8వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఓట్లతో మద్దతు పలికి అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పాలన ఇళ్ల ముంగిటకే వచ్చిందని చెప్పారు. మూడు దశాబ్దాలపాటు ఒకే పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదని విమర్శించారు.

ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ..

ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ఎస్ ఆర్ బాయ్స్ హై స్కూల్ ఆవరణంలో ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అందరి భవితవ్యం కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.