వైయస్సార్ చేయూత పథకం కింద పశువుల కొనుగోలు టెండర్లను గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాం నుంచి ఉన్న గుత్తేదారులకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని గుత్తేదారు కరీం ఆరోపించారు. విజయవాడలో మాట్లాడుతూ.. పాడి ఎక్కడ ఉంటే అక్కడ పంట ఉంటుందని నాడు వైయస్సార్ పశుక్రాంతి పథకం ప్రవేశపెట్టారని.. తరువాత తెదేపా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించిందన్నారు. ఇప్పుడు అదే గుత్తేదారులకు కొంతమంది అధికారులు టెండర్లు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని యత్నించినా సాధ్యపడలేదన్నారు. గతంలో సదరు గుత్తేదారులు పాలిచ్చే గేదెలను కాకుండా ఆర లీటర్, లీటర్ పాలిచ్చే నాణ్యత లేని గేదెలను కట్టబెట్టారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.టెండర్లు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.
ఇవీ చదవండి..