విజయవాడలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. సెప్టెంబర్ 17న ఆర్టీసీ కార్గోలో మద్యం అక్రమరవాణా చేస్తున్న కేసులో నిందితుడైన అజయ్‌ను ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అజయ్‌తో పాటు మరొకరినీ విచారించారు. గురువారం మధ్యాహ్నం అజయ్‌ను ఎస్ఈబీ కార్యాలయానికి తీసుకువచ్చి స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు.
గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో హఠాత్తుగా....అతను అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడని, వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : మంత్రి పెద్దిరెడ్డి నాపై కక్ష కట్టారు : జడ్జి రామకృష్ణ