ETV Bharat / city

PAINTING SKILLS: చేతులు లేకపోతేనేం...జీవితం చేజారలేదు.. - srikakulam district news

రెండు చేతులూ లేకుంటే జీవితమే లేదా?.. అని ఆమె ప్రశ్నించుకుంది.. ఎందుకు లేదు?.. మనసు ఆమెను ఎదురు ప్రశ్నించింది.. అండగా ఉంటానని గుండె బదులిచ్చింది. ఆ గుండె బలం, ఆమె దృఢ సంకల్పం ముంగిట వైకల్యం మోకరిల్లింది!

Handicapped woman
చేతులు లేకపోతేనేం...జీవితం చేజారలేదు..
author img

By

Published : Sep 25, 2021, 12:53 PM IST

పదేళ్ల వయసులో రెండు చేతులు కోల్పోయింది. అప్పటిదాకా స్నేహితులతో ఆడుతూ.. తోటి వారితో కలిసి బడికి వెళ్తూ ఆనందంగా గడిపింది. అకస్మాత్తుగా ఓ రోజు జరిగిన ప్రమాదం.. ఆమెను అవిటిదాన్ని చేసింది. ఆడుతూపాడుతూ సంతోషంగా గడపాల్సిన ఆ చిన్నారి జీవితాన్ని చీకటిపాలు చేసింది. ఆ బాలికది చిన్న వయసే అయినా గుండె ధైర్యం మాత్రం పెద్దది. చేతులు పోయాయని ఏడుస్తూ కూర్చోలేదు. స్నేహితులతో కలిసి ఆడుకోలేనని కుంగిపోలేదు. ఆ ప్రమాదం.. తన నుంచి తీసుకెళ్లింది చేతులు మాత్రమేనని గ్రహించింది. చేతులు లేకపోయినా.. తన జీవితం ఇంకా తన అధీనంలోనే ఉందని అర్థం చేసుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందడుగేసింది. ఎన్నో కష్టాలను, ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో అధిగమించింది. కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసింది. కేవలం చదువుతో మాత్రమే ఆపలేదు. చేతుల్లేకున్న నోటితో చిత్రలేఖనం నేర్చుకుంది. అందులోనూ రాణించింది. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఆ యువతి కథ ఇది...

స్వప్నిక

ఈ చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు కొవ్వాడ స్వప్నిక.. 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. పదేళ్ల ప్రాయంలో స్వప్నిక విద్యుదాఘాతానికి గురికావటంతో ఆమె రెండు చేతులూ తొలగించాల్సి వచ్చింది. అయినా.. ఆమె కుంగిపోలేదు.. చదువును ఆపలేదు. కష్టాలకు ఎదురొడ్డింది.. డిగ్రీ పూర్తిచేసింది. చేతుల్లేకున్నా నోటి సాయంతోనే చిత్రలేఖనం నేర్చుకుంది. అంచెలంచెలుగా అందులో రాణించింది. 2013లో జాతీయ స్థాయి డ్రాయింగ్‌ పోటీల్లో మొదటి బహుమతి సాధించింది. ఆటల పైనా దృష్టిపెట్టింది. 2019లో విజయవాడలో రాష్ట్రస్థాయి వికలాంగుల క్రీడల పోటీల్లో పరుగులో ప్రథమ, లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుంది. చిన్నాచితకా సమస్యలకే కుంగిపోయి ఆత్మహత్యాయత్నాలు చేసే యువతలో స్థైర్యం నింపటం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉంటుంది. చేతులే లేని నేనే ఇన్ని సాధిస్తుంటే.. అన్నీ ఉండి మీరు చెయ్యలేనిదేముంటుంది..అంటూ వారిలో స్ఫూర్తిని రగిలిస్తోంది. ప్రస్తుతం సొంతూరులో బ్యాంగిల్‌ స్టోర్‌ నిర్వహిస్తూ తీరిక సమయాన్ని తన అభిరుచులు మెరుగుపరచుకునేందుకు వినియోగిస్తోందీ ధీశాలి.

స్వప్నిక లాగే ఎంతో మంది తమ వైకల్యాన్ని అధిగమించి వారు అనుకున్న రంగంలో ముందుకు సాగుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి హైదరాబాద్​కు చెందిన ఛాయాదేవి. ఇంటిపైకి లారీ దూసుకువచ్చిన ప్రమాదంలో.. వెన్నెముక విరిగిపోయింది. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. గర్భవతిగా ఉండగానే ప్రమాదం జరగడంతో నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాణాలతో బయటపడినా జీవితం మంచానికే పరిమితమవ్వడంతో కుమిలిపోయింది. కొంత కాలానికి ప్రమాదం నుంచి తేరుకుని ధైర్యం కూడగట్టుకుంది.. తనకు ఇష్టమైన కుట్టుపని, మొక్కల పెంపకంపై దృష్టిసారించింది. ఇప్పుడు ఆ మొక్కల మధ్య ఆహ్లాదకరమైన జీవితం గడుపుతోంది.

చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడే నేటి యువతరానికి వీరి జీవితాలే స్ఫూర్తి. సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోని కుదుపు వచ్చినా.. వెనక్కి తగ్గలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దేవుడిచ్చిన ఈ అందమైన జీవితంలో ఆ ప్రమాదాలు ఓ చిన్న మచ్చలుగా మాత్రమే మిగలిపోవాలి కానీ.. అవే పెద్దవై జీవితాల్ని మాయం చేయొద్దని చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎన్ని కష్టాలెదురైనా.. అన్నింటిని చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.