ETV Bharat / city

వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన' - వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన' కార్యక్రమం !

వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ప్రభుత్వం 'మన పాలన- మీ సూచన' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై రాష్ట్ర జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన' కార్యక్రమం !

author img

By

Published : May 25, 2020, 12:02 AM IST

వైకాపా పాలన ఏడాది పూర్తైన సందర్భంగా నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'మన పాలన- మీ సూచన' పేరిట మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర స్థాయిలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయల వ్యవస్థపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం లైవ్ టెలికాస్ట్​ను జిల్లాలకు ప్రసారం చేయనున్నారు.

జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలు, 27న విద్యారంగంలో సంస్కరణలు , 28 న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ నెల 30 తేదీన ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిచనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.