అప్పుల తిప్పల కోసం... రైతుల ప్రాణాలకు ముప్పు తెస్తారా అని.... ప్రభుత్వాన్ని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అన్నదాతలకు ఇచ్చేది విద్యుత్ రాయితీ కాదన్న యనమల.... కార్పొరేషన్ కంపెనీలకు ఇచ్చేది రాయితీ ఎలా అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే..... డిస్కంలకు వైకాపా ప్రభుత్వం 4 వేల 802 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఈ లెక్కన.... ఐదేళ్లలో డిస్కంలకు 24 వేల కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ భారం పడేది రాబోయే ప్రభుత్వంపై కాదా అని ప్రశ్నించారు. సొంత మీడియాకే సగం ప్రభుత్వ ప్రకటనలు ఇస్తారా అని నిలదీశారు. 25 ఎకరాల ప్రభుత్వ భూములున్నా.... లేవంటూ కేంద్రానికి అబద్ధం చెప్పారని ఆరోపించారు. 13 వందల కోట్ల విలువైన సున్నపురాయి గనుల లీజులు జీవితకాలం పొడిగిస్తారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కరోనా వచ్చాక సాయిరెడ్డి మైండ్ పూర్తిగా పాడైంది: అయ్యన్న