ETV Bharat / city

WOMAN MURDER: కిల్లర్ దంపతులు.. అడ్డా మీద మహిళా కూలీలపైనే గురి! - తెలంగాణ వార్తలు

అడ్డా మీద మహిళా కూలీలే ఆ భార్యాభర్తల లక్ష్యం. ఒంటరిగా కనిపించిన మహిళను కూలీ పని ఉందంటూ నమ్మించి తీసుకువెళ్తారు. అనంతరం కూలీపై భర్త లైంగిక దాడికి పాల్పడితే... భార్య బంగారం తస్కరిస్తుంటుంది. ఓ మహిళ కూలీ కనిపించకుండా పోయిన ఘటనలో ఆ దంపతుల గురించి తీగ లాగితే డొంక కదిలింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి.

కిల్లర్ దంపతులు.. అడ్డా మీద మహిళా కూలీలపైనే గురి!

author img

By

Published : Jul 28, 2021, 7:44 PM IST

తెలంగాణలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ మల్లంపేట్‌ ప్రాంతంలోని మహిళా కూలీ బామిని ఈ నెల 25న పనికోసం వెళ్లి... అదృశ్యమైంది. మూడు రోజుల కిందట అదృశ్యమైన మహిళ గుట్టల్లో శవమై తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. మహిళలపై అత్యాచారం చేస్తూ... బంగారం తస్కరిస్తున్న భార్యాభర్తల గుట్టు బయటపడింది.

ఎలా గుర్తించారు?

దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు రోజుల కిందట అదృశ్యమైన మహిళ గుట్టల్లో శవమై తేలింది. బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుట్టల్లో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనే శవపరీక్ష చేయిస్తున్నారు. అదృశ్యం కేసును హత్యకేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యం కేసు

పనికి వెళ్లిన తన భార్య సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందని ఆ భర్త అనుకున్నారు. కానీ ఆమె రాకపోవడంతో చుట్టుపక్కలా గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడం వల్ల... మరుసటి రోజు దుండిగల్ పోలీసులకు కీతావత్ సోమనాధ్ ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఏం జరిగింది?

ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన జంటతో కలిసి బామిని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా కూలిపని కోసమని వాళ్లు ఆమెను తీసుకెళ్లినట్లు తేలింది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా స్వామి, అతని భార్య నర్సమ్మను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. బామినిని హత్య చేసిన చోటును దంపతులు చూపించారు.

కిల్లర్ దంపతులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారం గుట్టల్లో రంగులు వేయాలంటూ బామినిని తీసుకు వెళ్లారని పోలీసులు తేల్చారు. గుట్టలపైకి వెళ్తున్న సమయంలో ఇంకా ఎంత దూరం అని బామిని ప్రశ్నించగా నర్సమ్మ ఆమె గొంతు నులమగా... స్వామి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అనంతరం భార్య నర్సమ్మతో కలిసి బామినిని హతమార్చి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పరారయ్యారని వెల్లడించారు.

గతంలోనూ కేసులు

గతంలోనూ ఆ భార్యాభర్తలిద్దరూ ఒంటరి మహిళలను తీసుకెళ్లి వారి విలువైన వస్తువులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారా? లేదా అనే దానిపై దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వామి, నర్సమ్మలు వికారాబాద్ జిల్లాకు చెందినవారిగా గుర్తించిన పోలీసులు... వారు నివశించే చోటును మార్చుతూ అదును చూసి చోరీలకు పాల్పడి అక్కడినుంచి జారుకుంటారని వివరించారు.

ఇదీ చదవండి: దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.