కృష్ణా జిల్లా గన్నవరం మండలం దుర్గాపురంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గన్నవరానికి చెందిన పెరుమాళ్ల రవికుమార్ కూతురు శ్రీలక్ష్మి(26)కి.. నందివాడ మండలం చేదుర్తిపాడుకు బోనం విజయ్ కుమార్‌తో.. 9 నెలల క్రితం వివాహం జరిగింది. విజయ్‌కి చెన్నైలో ఉద్యోగం అని చెప్పి వివాహం చేశారని.. కానీ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నట్లు..ట్రాక్టర్ కొనుక్కుంటానంటే రూ.లక్ష ఇచ్చినట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. అదనపు కట్నం కోసం.. తన కూతురుని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. దాంతో మానసికంగా ఒత్తిడికి గురై.. తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవేదన చెందారు.
ఇదీ చదవండి:
Harrasment: స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్