ETV Bharat / city

బెజవాడ పీఠాన్ని అధిష్టించే వనిత ఎవరు? - విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు 2020

రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే... కృష్ణా జిల్లాలోని బెజవాడ రాజకీయం మరో ఎత్తు. తాజాగా నగర పాలక సంస్థ ఎన్నికలకు నగారా మోగటంతో.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇక్కడ తిరుగులేని విజ‌యం సాధించగా... వైకాపా వ్యూహాత్మక తప్పిదాలతో ఓటమి చవిచూసింది. తాజా ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని పసుపుదళం ధీమా వ్యక్తం చేస్తుంటే... అధికారంలో ఉన్న తమదే విజయం అంటోంది వైకాపా.

Vijayawada mayor seat?
Vijayawada mayor seat?
author img

By

Published : Mar 12, 2020, 8:00 AM IST

బెజవాడ పీఠాన్ని అధిష్టించే వనిత ఎవరు?

మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కార్పొరేషన్‌లో గతంలో 59 డివిజన్లు ఉండగా.... పునర్విభజన తర్వాత ప్రస్తుతం 64 డివిజన్లకు పెరిగాయి. ప్రతి డివిజన్​కు ఒక్కో పార్టీ నుంచి నలుగురి నుంచి ఐదుగురు పార్టీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

తెదేపా నుంచి నలుగురు పోటీ..

ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా బలపడింది. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లోనూ చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మేయర్ పదవి కోసం తెలుగుదేశం నుంచి ప్రధానంగా నలుగురు మహిళలు రేసులో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె కేశినేని శ్వేతను బరిలో దింపుతున్నారు. నగరంలో పట్టున్న ప్రాంతమైన 11వ డివిజన్ నుంచి శ్వేత నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ కేశినేని నాని తరఫున శ్వేత వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.

మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. దివంగత నేత దేవినేని బాజీ సతీమణి అయిన ఈమె.. గతసారి 2వ డివిజన్ కార్పొరేటర్​గా గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా భార్య బొండా సుజాత మేయర్ రేసులో ఉండగా.... తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ పేరూ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 64 డివిజన్లలో అత్యధిక సీట్లలో గెలుపొందిన పక్షం నుంచి మహిళకు నగర మేయర్‌ పదవి దక్కనుంది.

ఆ నియోజకవర్గాలే కీలకం

గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తూర్పును తెదేపా దక్కించుకోగా.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నానికి మాత్రం ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు 30వేల ఓట్ల మెజారిటీ దక్కింది. ఈ ఓటు బ్యాంకును నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ సద్వినియోగం చేసుకుంటామనే ధీమాతో తెలుగుదేశం ఉంది.

కలిసి పోరాడండి..

పార్టీలోని అంతర్గత విబేధాలను పక్కనబెట్టి.. ఈసారి కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. గెలుపే లక్ష్యంగా పోరాడాలని శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాజధాని మార్పుపై రచ్చ జరుగుతున్నందున వైకాపాకు ఉన్న ప్రజా వ్యతిరేకతను తాము సద్వినియోగం చేసుకుంటామని నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

భాజపా మహిళా అభ్యర్థి చేయి నరికిన వైకాపా నాయకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.