రాష్ట్రంలో మెుబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.ఎస్. నాగిరెడ్డి స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయానికి ఉపయోగించే వాహనాలకు మినహాయింపునిచ్చామని తెలిపారు. దాన్యం కోనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం కోనుగోలు చేస్తామన్నారు. మెుక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపిన ఆయన...కనీస మద్దతు ధర కంటే పప్పుల రేట్లు పెరగటం వల్ల ప్రస్తుతం మినుము కోనుగోళ్లు జరపటం లేదన్నారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
ఇదీచదవండి