APDCL CMD on electricity employees: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నారని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మజనార్దనరెడ్డి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ప్రచారాన్ని.. తాము సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఆయా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగుల జీతాలు తగ్గింపు, పింఛను కోత, ఇతర రాయితీలు రద్దు వంటి ప్రచారాలను ఎవరూ విశ్వసించొద్దని కోరారు. ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సమయంలోనూ ఎవరూ ఎలాంటి అపోహలకు గురవ్వాల్సిన అవసరం లేదని, కంపెనీలు తీసుకునే ఏ నిర్ణయమైనా సిబ్బందికి నష్టం కలిగించబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పీఆర్‌సీ కమిటీ వేయబోతోందని.. అందుకు అనుగుణంగానే విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు ప్రయోజనాలు ఉంటాయని అన్నారు.
ఇదీ చదవండి: