ETV Bharat / city

VROs Statewide protest: మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే.. వీఆర్వోల నిరసన

VROs protests against Minister Appalaraju: వీఆర్వోలపై మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలకు వ్యతరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల పర్యం కొనసాగుతోంది. తమను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్న గ్రామ రెవెన్యూ అధికారులు.. ఆ వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Dec 9, 2021, 7:17 PM IST

vros protest against Minister Appalaraju comments

VROs protest against Minister Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా వీఆర్వోల అసోసియేషన్ నిరసన చేపట్టింది. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా అధికారులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భాస్కర్​ రెడ్డి అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మచిలీపట్టణంలో నిరసనలు..
VROs protest At Machilipatnam: వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు. ఈమేరకు కృష్ణా జిల్లా వీఆర్వోల జిల్లా సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్టణం కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరతూ.. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.

కడప జిల్లాలో..
VROs protest At Kadapa: మంత్రి అప్పలరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కడప జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో కడపలోనూ వీఆర్వోపై కొంతమంది దాడి చేస్తే.. దానికి రాజకీయ నాయకులు వత్తాసు పలకడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ పథకాలు అన్నింటిని ప్రజల్లోకి చేర వేస్తున్న తమపై ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా..
VROs protest At Eluru: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఅర్వోలు ధర్నా చేపట్టారు. వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. వారంరోజులుగా వీఆర్వోలు ఆందోళన చేస్తున్నా.. కనీసం మంత్రి పట్టించుకోలేదని వీఆర్వో సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రీ తీరులో మార్పు రాకుంటే రాష్ట్ర నలుమూలల నుంచి పలాస వెళ్లి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసనలు..
VROs protest At Kakinada: మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్​ వద్ద గ్రామ రెవెన్యూ అధికారులు నిరసన చేపట్టారు. మంత్రి అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంఘం కమిషనర్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఏపీ రెవెన్యూ ఐకాస ఛైర్మన్ దివాకర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి..Venkatrami Reddy On PRC: పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ? : వెంకట్రామిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.