నిఘా పరికరాల కొనుగోలులో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో తనను ఏదో విధంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం..ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్ విషయంలో ఇతర తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ధర్మాసనం గతంలోనే ఆదేశించింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం.. 8 మంది కరోనా రోగుల మృతి