Medicines in vijayawada railway hospital: విజయవాడ రైల్వే ఆసుపత్రి ఔషధాల కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగినట్లు రైల్వే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించి, ఏజెన్సీలకు మేలు కలిగేలా రెండు సార్లు జీఎస్టీ మొత్తాన్ని చెల్లించినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు మందుల సరఫరాకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మందుల కొనుగోలుకు టెండర్ పిలిచినపుడు..ప్రాథమిక ధరపై ఎక్కువ రాయితీ కోట్ చేయాలని పేర్కొన్నారని అధికారులు తెలిపారు. టెండర్లు పూర్తయ్యాక మాత్రం గరిష్ఠ చిల్లరధరపై రాయితీ అని ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అలా 11 మందుల సరఫరా చేసే ఏజెన్సీలకు రెండుసార్లు పన్ను రూపంలో.. రూ.16.91 లక్షలు చెల్లించినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
ఇదీ చదవండి: