విజయవాడలో రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల్లో ఇద్దరు రౌడీషీటర్లపై పోలీసు కమిషనర్ నగర బహిష్కరణ విధించారు. ఈనెల 2న భవానీపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ను 6 నెలలపాటు నగరం నుంచి బహిష్కరించగా.. తాజాగా కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ భూపతి చంద్రశేఖర్ అలియాస్ చందును 6 నెలల పాటు నగరంలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవరిస్తున్నందున నగర బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్.కె మీనా