ETV Bharat / city

విజయవాడ కనకదుర్గ గుడి వెబ్​సైట్​ నిలిపివేత

author img

By

Published : Mar 25, 2021, 8:32 AM IST

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వెబ్​సైట్​ను నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు.

Durgagudi
దుర్గగుడి

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి నాలుగేళ్లుగా సేవలు అందిస్తున్న (kanakadurgamma.org) వెబ్‌సైట్‌ను బుధవారం ఆకస్మికంగా నిలిపి వేయడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. శ్రీశైలం దేవస్థానంలో ప్రైవేటు సంస్థ నిర్వహణలో వెబ్‌సైట్‌ ద్వారా దర్శనం టిక్కెట్లలో గోల్‌మాల్‌ జరగడంతో గత నెలలో దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నిర్వహణపై ఆరా తీశారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే వెబ్‌సైట్లను నిలిపివేయమని ఆదేశించారు. నెల రోజులు గడిచినా దుర్గగుడిలో ప్రైవేటు వెబ్‌సైట్‌ను వినియోగించడంపై వారు గత రెండు రోజులుగా నిర్వహించిన 6ఎ దేవస్థానాల కార్యనిర్వహణాధికారుల వీడియో కాన్ఫెరెన్సులో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో వెబ్‌సైట్‌ను 2017లో అప్పటి ఈవో సూర్యకుమారి విశాఖకు చెందిన ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. అప్పటి నుంచి వారు దేవస్థానంలో ఆన్‌లైన్లో డొనేషన్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు కొనుగోలు సంబంధిన సేవలు భక్తులకు అందిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ దేవస్థానానికి ఉచితంగా సేవలు అందించారు. దేవాదాయశాఖ ప్రస్తుతం టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా మాత్రమే భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించింది. అయితే టీఎంఎస్‌ ద్వారా ప్రస్తుతం దేవాలయాల్లో మాత్రమే దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవలు అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆర్జిత సేవలు, డొనేషన్లు ఇవ్వడానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే వెబ్‌సైట్‌ను నిలిపివేయడంతో దుర్గగుడికి రోజుకు రూ.20 లక్షల ఆదాయానికి గండిపడుతుంది. ఈ విషయంపై ఈవో సురేష్‌బాబును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో టీఎంఎస్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.