విజయవాడలో కరోనా వైద్యం అందిస్తున్న ఆస్పత్రులపై జిల్లా కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు జేసీ ఎల్. శివశంకర్ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి, రోగుల వద్దనుంచి అధిక వసూళ్లకు పాల్పడిన 11ఆస్పత్రులపై రూ.44 లక్షల అపరాధ రుసుము వసులు చేశామన్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స నిమిత్తం.. జిల్లాకు అవసరమైన మందుల సరఫరా, ఫంగస్ గుర్తించే ల్యాబ్ లు, కొవిడ్ వైద్య సేవలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద చేపట్టాల్సిన అంశాలపై ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఇదీ చదవండి: