విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణ జరగనుండగా.. గిరి ప్రదక్షిణలను నిలిపివేయనున్నట్లు దేవస్థాన ఈవో సురేష్ బాబు తెలిపారు. కేశఖండన శాల, నదీ స్నానాలు, జల్లు స్నానాలకూ ఇది వర్తిస్తుందన్నారు. ఆ రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే అమ్మవారిని దర్శించుకోవచ్చన్నారు. భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలని సూచించారు. క్యూలైన్లలో ప్రతీ రెండు గంటలకు ఒకసారి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేస్తామన్నారు.
మాల విరమణను గురుభవానీల సమక్షంలో స్వగ్రామాల్లోనే పూర్తిచేసి.. ఇరుముడులను దేవస్థానానికి సమర్పించాలని ఆలయ ఈవో సూచించారు. దీక్షా విరమణ సమయంలో రోజుకు 10 వేల మంది స్లాట్ బుక్ చేసుకున్న వారినే దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన భక్తులను అనుమతించమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: