విజయవాడ నగరంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చోరీలను అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టమ్‌ను అమర్చుకోవాలని విజయవాడ సీపీ శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. నేరస్తులు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ విధానాన్ని నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టమ్‌ను అమరుస్తారని తెలిపారు.
ఈ విధానం ద్వారా ఇంట్లో ఓ కెమెరాను అమర్చి... కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఎవరైనా నేరస్తుడు ఇంట్లోకి చొరబడితే వెంటనే ఆ కెమెరా సెన్సార్ గుర్తించి స్థానిక పోలీసులకు, కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళుతుందని స్పష్టం చేశారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు అవకాశముంటుందని సీపీ తెలిపారు. ముందుగా చరవాణిల్లో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీచదవండి