ETV Bharat / city

INDIA BOOK OF RECORD: కండక్టర్ అద్భుత ఘనత.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు - india book of records with wrote APSRTC name on post card

పనిచేస్తున్న సంస్థపై మక్కువ, సాధించాలన్న తపన ఆయనలో బలంగా నాటుకుపోయాయి. సాధారణ ఉద్యోగిలా జీవనం సాగించకుండా సంస్థకు, తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. విధులు నిర్వహిస్తూనే... 15 రోజులుపాటు రేయింబవళ్లు శ్రమించి... తాను పని చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) పేరును పోస్ట్ కార్టుపై 7,600 సార్లు రాసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్(india book of record) లో చోటు సంపాదించారు కండక్టర్ అబ్బాస్ వలీ.

కండక్టర్ అద్భుత ఘనత
కండక్టర్ అద్భుత ఘనత
author img

By

Published : Aug 11, 2021, 10:21 PM IST

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అబ్బాస్ వలీ.. 11 ఏళ్లుగా విజయవాడలోని విద్యాధరపురం డిపోలో కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం సాధించినా, ఇంకా ఏదో సాధించాలన్న తపనతో ఆర్టీసీకి సంబంధించిన అనేక బొమ్మలు గీసేవారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో తనకు, తాను పనిచేస్తున్న సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. విధులు నిర్వహిస్తూనే.. 15రోజులు శ్రమించి పోస్ట్ కార్డుపై 7,600 సార్లు ఏపీఎస్ఆర్టీసీ పేరును రాశారు. దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు. ఆయన రాసిన ఏపీఎస్ఆర్టీసీ పదాలను లెక్కించి ఆవార్డు ప్రదానం చేశారు.

కండక్టర్ అబ్బాస్ వలీ ఈ ఘనత సాధించటంపై డిపో మేనేజర్​తోపాటు సహోద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు రావటం సంతోషంగా ఉందని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తమ నాన్న ఆదర్శంగా నిలిచారని అబ్బాస్ కుమార్తె, కుమారుడు తెలిపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్ మాత్రమే కాకుండా సంస్థకు మరింత పేరు తీసుకువచ్చేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​ కూడా సాధన చేస్తానని అబ్బాస్ వలీ స్పష్టం చేశారు.

కండక్టర్ అద్భుత ఘనత

ఏపీఎస్ఆర్టీసీ నాకు జీవితాన్నిచ్చింది. నా కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం ఏపీఎస్ఆర్టీసీనే. అందరిలా కాకుండా నేను పని చేస్తున్న సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతోనే పోస్టుకార్డుపై సంస్థ పేరును రాశాను. సమైక్య ఆంధ్ర ఉద్యమంలోనూ నేనూ పాల్గొన్నాను. ఆర్టీసీకి మరింత పేరును తీసుకువచ్చేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు కూడా సాధన చేస్తాను.

-షేక్ అబ్బాస్ వలి, గుడివాడ, కృష్ణా జిల్లా

మా నాన్నకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించింది. విధులు నిర్వహించుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పటికీ.. పోస్టు కార్డుపై ఏపీఎస్ఆర్టీసీ పేరును ఆయన రాసేవారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికే మా నాన్నే మాకు ఆదర్శం.

-అబ్బాస్ కుమార్తె, అబ్బాస్ కుమారుడు

ఇవీచదవండి.

viveka murder case: వైఎస్​ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం

మ్యూజిక్​లోనే కాదు రెమ్యూనరేషన్​లోనూ టాపే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.