venkaiah naidu:రాజకీయ నాయకులకు నైతిక విలువలు ఉంటేనే.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆకలి, అవినీతి, లింగ వివక్ష లేనప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. లింగ వివక్షను రూపుమాపేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాషకు అత్యున్నత స్థానం ఇవ్వాలని సూచించారు. దేశంలో 23 శాతం నిరక్షరాస్యత ఉందని పేర్కొన్నారు. చరిత్ర పుస్తకాల్లో మన దేశ నాయకుల పేర్లు లేవని, వాటిని మార్చి రాయాల్సి ఉందని అన్నారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఇతర దేశాలపై దాడులు చేయడం వల్ల ప్రపంచ శాంతి కనుమరుగువుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: విజువల్ వండర్‌గా.. 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్