విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో... నాలుగో వార్షిక అఖండ కచ్ఛపీ మహోత్సవం వైభవంగా జరిగింది. సరస్వతీ దేవి ముద్దుబిడ్డలుగా అఖండ కీర్తి గడించిన వైణిక విద్వాంసుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు నిర్విరామంగా వీణాధారిణి అయిన సరస్వతీ దేవికి నాదహారతి పట్టారు. తెలుగు రాష్ట్రాల విద్వాంసులే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల విద్యాంసులు వీణానాదంతో సరస్వతీదేవికి స్వరహారతులిచ్చారు.
ఆదరణ తగ్గుతోంది
సంగీతంలో వాద్యత్రయం అయిన వీణ, వేణు, మృదంగాల్లో... సరైన సహకారం, ప్రోత్సాహకాలు లేని కారణంగా ఆదరణ తగ్గుతోందని... వీటిపై ప్రజలకు ఆసక్తి కలిగించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్వాంసులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుందన్నారు. సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి.... వాద్యత్రయం ప్రాశస్త్యాన్ని విస్తరిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: