ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి చర్యలు చేపట్టినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హరే క్రిష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉయ్యాలలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించారు. వేద పండితులు కృష్ణునిలీలలు, తాత్వికచింతనలను చదివి వినిపించారు. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. హరే క్రిష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయన్నారు. వారు ప్రజల్లో భక్తి భావం పెంపొందించటంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి శ్రీకృష్ణుడు ప్రపంచానికి తెలియజేశారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కరోనా కష్ట కాలంలో హరే క్రిష్ణ మూవ్మెంట్ ప్రతినిధులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆమె కొనియాడారు. మానవ సేవే-మాధవ సేవ అన్న తత్వాన్ని ఆచరిస్తూ..కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారన్నారు.
అంతకుముందు కొత్తపేట యాదవ్ కల్యాణ మండపం, బ్రాహ్మణవీధిలోని వేణుగోపాల స్వామి దేవాలయం, శ్రీ కృష్ణ ప్రార్ధనా మందిరం, రామవరప్పాడు రింగ్ వద్ద ఆలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్యే విష్ణు, మేయర్, వైకాపా శ్రేణులతో కలిసి పాల్గొన్నారు
ఇదీ చదవండి