ETV Bharat / city

ఫాస్టాగ్​ ఉన్నా ఫలితం లేదు.. కీసర టోల్​గేట్ వద్ద వాహనాలు బారులు - కీసర టోల్​గేట్ వద్ద వాహనాలు రద్దీ వార్తలు

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. వాహనాలకు ఫాస్టాగ్​ ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో వేచి ఉండక తప్పటం లేదు. ఒక్కో వాహనం 10 నుంచి 20 నిమిషాల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

vehicle-waiting-at-keesara-toll-gate
కీసర టోల్​గేట్ వద్ద వాహనాలు బారులు
author img

By

Published : Jan 10, 2021, 4:20 PM IST

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై వరుసగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటం.. నందిగామ సమీపంలోని కీసర టోల్​గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలకు ఫాస్టాగ్​ ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో వేచి ఉండక తప్పటం లేదు. టోల్ ప్లాజా నిర్వాహకులు వాహనాలు ఎక్కువ సేపు వేచి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఒక్కో వాహనం 10 నుంచి 20 నిమిషాల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

కీసర టోల్​గేట్ వద్ద వాహనాలు బారులు

గతం కంటే మెరుగైన పరిస్థితి..

ఫాస్టాగ్ ఏర్పాటు వలన గతం కంటే పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ గతేడాదితో సంక్రాంతి సమయంలో నగదు రూపంలో టోల్ వసూలు ఉండటం టోల్​గేట్ దాటేందుకు ఎక్కువ సమయం పట్టేది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈసారి పరిస్థితి కొంచెం మెరుగావటం కొంత వరకు ఊరట చెందుతున్నారు. అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉంటే వేగంగా వెళ్లేందుకు మరింత అవకాశం ఉంటుందని టోల్​ ప్లాజా నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి... : కృష్ణాలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.