ప్రభుత్వ తప్పులను పట్టాభి ఎత్తి చూపించినందుకే దాడి చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పట్టాభి కారుపై దాడి చేసిన వారిని 24 గంటల్లో పోలీసులు పట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన సతీమణి సైతం అంగీకరించరని చెప్పారు. కృష్ణదాస్ లా తామూ మాట్లాడగలం కానీ.. తెలుగుదేశం పార్టీ తమకు సభ్యత నేర్పిందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గర పడిందన్నారు.
ఇదీ చదవండి: