జగన్ ముఖ్యమంత్రిగా (CM Jagan) ప్రమాణం చేసినప్పటి నుంచి 'రాష్ట్రం నేరస్థులకు స్వర్గధామంగా, డ్రగ్స్ ట్రాఫికర్స్కు పెద్ద ట్రావెల్ జంక్షన్లా మారింది' (Drug Traffickers Travel Junction) అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla ramaiah) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల యువత భవిష్యత్తు నిర్వీర్యమవుతోందన్నారు. లక్షా75 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ నుంచి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ దిగుమతికి నిర్దేశిస్తే..అలాంటిదేం లేదని డీజీపీ చెప్పటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. 'హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ' (Who is Drug Don in AP) అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని అన్నారు.
ఇదీ చదవండి