శ్రీశైలం ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో మూల మలుపు వద్ద రక్షణ గోడను వ్యాను ఢీకొని 20 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో అందులో 9 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఈగలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ దూల్‌పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి ఈగలపెంట ఎస్సై పోచయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.