తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో... ఎ-1 వెల్ది వసంతరావు, ఎ-2 కుంట శ్రీనివాస్, ఎ-3 అక్కపాక కుమార్, చిరంజీవి ఉన్నారు.
వామనరావు దంపతుల హత్య కేసును నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రాత్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సుమోటోగా స్వీకరించి...దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
సంబంధిత కథనాలు: