వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి నిధుల కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేవాదాయశాఖ నిధులను వాహనమిత్రకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ లబ్ధి కోసం దేవాదాయశాఖ నిధుల్ని ఖర్చుచేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. నిధులు ఖర్చు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను జులై 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..మీ అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్