దిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి మాణిక్యాలరావు, పలువురు రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ వాహన శ్రేణితో విమానాశ్రయం నుంచి విజయవాడ గేట్ వే హోటల్ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌ను కేంద్రమంత్రి కలవనున్నారు. అనంతరం నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసే ప్రాంతంలో... ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. తరువాత రాజమండ్రికి బయల్దేరుతారు.
ఇదీ చదవండి: